Amma Dairylo Konni Pegilu

200.00

There are only 3 items left in stock.
నాకో సంగతి చెప్పు... అసలు ఎవరైనా నీకు ఇంతకు ముందు ఉత్తరం రాశారా? ప్రేమలేఖలో, మామూలు లేఖలో. పోనీ నువ్వెప్పుడైనా రాశావా? మామూలుగా మనం రోజూ మాట్లాడుకునే మాటల్నే పొందిగ్గా పేర్చి కాయితం మీద పెడితే ఉత్తరం అయిపోతుందనుకునే అల్పసంతోషిని నేను. ఇవాళెందుకో ఇప్పటికిప్పుడే నీకో ప్రేమకథ చెప్పాలనిపించి, నీకు ఉత్తరాలు చదివే అలవాటుందో లేదో తెలీకుండానే రాసేస్తున్నాను.
బహుశా నేను అమ్మకథని చెప్పాలనుకోవడం దగ్గర, అమ్మకి కూడా ప్రేమకథ ఉంటుందనుకోవడం దగ్గర ఈ ప్రయాణం మొదలై ఉండొచ్చు. వెన్నెల రాత్రుల్లో అలల్ని లెక్కపెడుతూ, కలల్ని దాచుకుంటూ నేను ఇష్టంగా రాసిన ప్రేమలేఖే నా ఈ అమ్మడైరీలో కొన్నిపేజీలు.
ఇది అమ్మ ప్రేమకథ.

Reviews